Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్యలు చేసే నన్నే డబ్బులు అడుగుతావా? వైకాపా నేత చికెన్ బాషా

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల అరాచకాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. తమకు ఎదురుతిరిగే వారిపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నారు. తాజాగా ఆస్పత్రి బిల్లు చెల్లించమన్నందుకు వైకాపా నేత చికెన్ బాషా ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దికారు. మర్డర్లు చేసే నన్నే డబ్బులు అడుగుతావా? నీకెంత ధైర్యం? అంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముచ్చుమర్రికి చెందిన చికెన్ బాషా అనే వ్యక్తి కుమార్తె ఐదు నెలల గర్భిణి. ఆమెకు  రక్తస్రావం, నొప్పులతో బాధపుడుతుంటే నందికొట్కూరులోకని సుజాత ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం బిల్లు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది బాషాను కోరారు. 
 
ఆ మాట వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన బాషా.. తన అనుచరులతో కలిసి ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. మర్డర్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా? అని బెదిరించాడు. తాను బైరెడ్డి సిద్ధారెడ్డి మనిషినని, తలచుకుంటే సాయంత్రానికల్లా ఇక్కడ ఆస్పత్రి ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు మాత్రం ఫిర్యాదు పత్రంలో సంతకం లేదని పేర్కొంటూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments