Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చింది: భాజపా ఎమ్మెల్సీ మాధవ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (22:23 IST)
రాష్ట్రప్రభుత్వం మొదటిసారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని సిఎం జగన్ కేంద్రాన్ని అడిగారన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్సి, ఎమ్మెల్సీ మాధవ్. పింఛను, జీతాలు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చిందన్నారు. 

 
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు బిజెపి అండగా నిలుస్తుందన్నారు. 

 
గ్రామ సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం అందించాలన్నారు. విధివిధానాలు లేక గ్రామ సచివాలయ ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారన్నారు. సినిమా ధరలు తగ్గించి ఎవరినో ఇబ్బందులు గురిచేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. 

 
నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజల్ ధరలను విపరీతంగా ప్రభుత్వం పెంచేసిందన్నారు. పండుగలు వస్తే విపరీతంగా యాభై శాతం వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై అధిక భారం మోపుతోందన్నారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.

 
పంజాబ్ లో ప్రధానిని అడ్డుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా దేశంలో ఉందన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ కరువైందని విమర్సించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments