Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు: కాట్రగడ్డ ప్రసూన

Advertiesment
రాష్ట్రాన్ని  రావణకాష్టం చేస్తున్నారు: కాట్రగడ్డ ప్రసూన
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (21:38 IST)
రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా లోపించాయి , ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీద , దాడులు చేయడం చూశాం , ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కార్యాలయాల మీద పడి దాడి చేయడం అత్యంత హేయం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యరాలు కాట్రగడ్డ ప్రసూన  పేర్కొన్నారు.
 
ఇటీవల డిసెంబర్ నందు తాడిపత్రి లోని జెసి ఇంటిమీద ,తర్వాత పట్టాభి ఇంటి మీద దాడి జరుగగా అది కాకుండా జాతీయ అధ్యక్షులు  చంద్రబాబు ఇంటి మీదకు కూడా ఇటీవల ఇదే తరహా దాడికి యత్నించడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్పష్టం అవుతోంది అని కాట్రగడ్డ ప్రసూన ధ్వజమెత్తారు.
 
ఇంత మంది గుంపులు గుమిగూడి దాడులకు బయలుదేరుతున్నా పోలీస్ వారికి ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్  వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం , అక్రమ కేసులు బనాయించడం ప్రతిపక్ష నేతల గొంతును బలవంతంగా నొక్కే ప్రయత్నం జరుగుతుంది. 

ఈ రాష్ట్రంలో ఈ వరుస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది, రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు అనిపిస్తోంది.
 
ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం , రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేయకపోతే రాష్ట్రం రావణకాష్టం కాకతప్పదు అని కాట్రగడ్డ ప్రసున  పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్‌కు షాక్: మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కిమ్