Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా టెంపర్ మెంట్ లూజ్ చేయడానికి సెకను చాలు.. బంద్‌కు బాబు పిలుపు

నా టెంపర్ మెంట్ లూజ్ చేయడానికి సెకను చాలు.. బంద్‌కు బాబు పిలుపు
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (21:06 IST)
రాష్ట్రంలో టీడీపీ నేతలు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించి నిప్పులు చెరిగారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు, తాను సాధారణంగా బంద్‌లకు పిలుపు ఇవ్వనని, కానీ నేడు జరిగిన ఘటనలతో బంద్‌కు పిలుపు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు.
 
హెరాయిన్ గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీలో గంజాయి సాగు గురించి పొరుగు రాష్ట్రాల డీజీపీలు చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగిందని అనడమే టీడీపీ నేతలు చేసిన తప్పా అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇవాళ్టి దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏనాడూ రాష్ట్రంలో 356 ఆర్టికల్ అమలు చేయాలని తమ పార్టీ గతంలో ఎప్పుడూ కోరలేదని, కానీ ఇవాళ్టి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పాలని అన్నారు. 
 
గతంలో ఎక్కడైనా 356 ఆర్టికల్ అమలు చేసి ఉంటే, ఇంతకంటే బలమైన కారణాలు అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి కాదా? ప్రతి ఒక్క పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు. తమకు కూడా కోపం, ఆవేశం, బాధ, తపన ఉన్నాయని... అయితే నిగ్రహించుకుంటున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు. దాడి విషయం తమకు తెలియదని అంటున్న డీజీపీ ఆ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. 
 
"నేను ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు. గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు కానీ, డీజీపీ ఎత్తడా? ఏమనుకుంటున్నారు. ఎన్ని బాధలున్నా నిగ్రహించుకుంటున్నాం. నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పటి నుంచి ఈ అరాచకాలు ప్రారంభం అయ్యాయి. రెండున్నరేళ్లుగా మీ దాడులు చూస్తున్నాం... నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు కానీ అది మీ వల్ల కాదు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్‌ను కుదిపేస్తున్న వర్షాలు - 11 రోజుల్లో 23 మంది మృతి