Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు డోంట్ వర్రీ, ఆ వైరస్ మీకు రాదంతే, ఎలా?

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (19:32 IST)
కరోనా వైరస్ పైన టిటిడి అప్రమత్తమైంది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, సప్తగిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు వద్ద ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా స్ప్రేలను చేతులకు కొడుతూ శుభ్రపరుచుకోమని సూచనలు చేస్తున్నారు.
 
టిటిడినే కాదు తిరుపతిలో రైల్వేశాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉంది. తిరుపతి నుంచి బయలుదేరే రైళ్ళలో స్ప్రేలను కొడుతున్నారు. రైల్వేస్టేషన్ లోనే భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వరం ఎక్కువగా ఉన్నా, జలుబు, దగ్గు ఉన్నా వెంటనే అలాంటి వారిని గుర్తిస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డుకు రెఫర్ కూడా చేస్తున్నారు.
 
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వైద్యులు తేల్చారు. అయితే తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత ఉండటంతో వైరస్‌లు సోకే ప్రమాదం లేదని వైద్యులు చెపుతున్నారు. అయినా సరే ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతను తూచా తప్పకుండా పాటించాలంటున్నారు. 
 
అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో ఎవరైనా అస్వస్థతకి గురైతే భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకుని వారి టికెట్టును dyeotemple@gmail.comకి మెయిల్ చేస్తే మరో రోజు దైవదర్శనం ఏర్పాటు చేసుకోవడానికి లేదా నగదు తిరిగి పొందడానికి వీలుంటుందని తితిదే వెల్లడించింది. ఇంకా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం ఈ నెల 17నుండి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని గదులలో వేచి ఉండే వీలు లేదనీ, టైమ్ స్లాట్ ప్రకారం వారు పొందిన టైమ్‌కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments