ప్రభుత్వాసుపత్రి మాత్రల్లో పురుగులు.. ఎక్కడంటే?

Webdunia
బుధవారం, 4 మే 2022 (15:18 IST)
ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చిన మాత్రల్లో పురుగులు కనిపించిన ఘటన వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్‌ కాలనీకి చెందిన ఎస్‌. మోహన్‌ జలుబు చేసిందని సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుడు పరిశీలించి 6 మాత్రలు ఇచ్చారు. 
 
మోహన్‌ ఇంటికొచ్చాక తీసి వేసుకుందామని చూడగా.. మాత్రలోంచి చెద పురుగులాంటిది బయటికి వచ్చింది. భయపడి మరొకటి చూడగా.. అందులోనూ పురుగులు కనిపించాయి.
 
మంగళవారం మిగిలిన 4 మందుబిళ్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించారు. దీనిపై వైద్యుడు వెంకటనాగేంద్ర స్పందిస్తూ.. 'మాత్రల్లో పురుగులు వచ్చిన మాట వాస్తవమే.. అవి కాలం తీరినవికావు. తయారీ లోపం వల్ల ఇలా జరిగింది. ఇకపై అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రైలర్ చూసి అలా కామెంట్స్ చేయడం మంచిదికాదు : అనిల్ రావిపూడి

అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ (Video)

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments