Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:55 IST)
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని బుడంపాడు సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. స్పందనా ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి విద్యార్థినిలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. 
 
యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని హోంమంత్రి సుచరిత ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు గాని, గురువులకు గాని, స్నేహితులకు చెప్పుకోవడం వలన మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు అని తెలిపారు. సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు. 
 
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అమ్మాయిలు, మహిళల కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ను రూపొందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది వరకు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా రక్షణ పొందిన మహిళలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.

ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దిశ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వీలయినంత మంది దిశ యాప్ ను ఉపయోగించుకొని రక్షణ పొందాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments