Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసిడ్ ఇంజెక్షన్‌తో ఇల్లాలిని చంపేసిన ప్రియురాలు... చీరాలలో దారుణం!

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (12:47 IST)
పరాయి పురుషుడిపై మనస్సుపడిన ఓ మహిళ... అతనితో పడక సుఖం పంచుకునేందుకే ఏకంగా అతని భార్యనే మట్టుబెట్టింది. అదీ కూడా యాసిడ్ ఇంజెక్షన్ తో దాడి చేసి హతమార్చింది. ఇందుకోసం ఆ మహిళకు మరో ఇద్దరు మహిళలు సహకరించడం గమనార్హం. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చీరాల ఎల్‌బీఎస్‌ నగర్‌కు చెందిన ఇలియాజ్‌ అనే వ్యక్తికి చీరాల, గుంటూరుల్లో చికెన్‌ షాపులున్నాయి. దుకాణం పనిమీద గుంటూరు వెళ్లే ఇలియాజ్‌కు అక్కడ వహీదా అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇలియాజ్ భార్య హసీనాకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. పైగా, ఫోనులో వహీదాను హసీనా తిడుతూ వచ్చింది. ఈ తిట్లు భరించలేదని వహీదా.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా ఇద్దరు మహిళలను తీసుకుని మంగళవారం చీరాలకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇలియాజ్‌ ఇంటికి వెళ్లింది. ఇద్దరు మహిళలు హసీనాను గట్టిగా పట్టుకోగా మరొకరు సిరంజిలో యాసిడ్‌ (బంగారాన్ని శుద్ధి చేయడానికి వాడే ద్రావణాన్ని) ఎక్కించి హసీనా మెడపైన, చేతిపైనా ఇంజెక్షన్‌ చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన హసీనా పిల్లలు కేకలు వేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 
 
అయితే, పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ముగ్గురినీ పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. అస్వస్థతకు లోనైన హసీనాను స్థానికంగా ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి గుంటూరుకు తరలించగా చికిత్సపొందుతూ ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు వహీదాను, ఆమెతోపాటు వచ్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments