Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు విడాకులిప్పించి.. పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడే వేధిస్తున్నాడు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (16:05 IST)
కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకున్నాడనీ, ఇపుడు వదలించుకునేందుకు వేధిస్తున్నాడంటూ ఓ ఎస్ఐపై మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అపుడు ఎస్.ఐ జగదీష్ తనకు న్యాయం చేస్తానని మొబైల్ నంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తనను ఇంటికి పిలిచి బలవంతంగా లొంగ దీసుకుని అత్యాచారం జరిపాడని పేర్కొంది. 
 
అప్పటి నుంచి బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడని పేర్కొంది. ఆ తర్వాత... తన భర్తకు విడాకులిప్పించి, తనను  వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే ఇపుడు తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తనకు ఆ ఎస్‌ఐతో  ప్రాణహాని ఉందని ఆందొళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకున్నారు. ఈ మేరకు ఆమె నరసారావు పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments