సింహాచలం దేవాలయం, శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ రద్దు చేస్తూ విశాఖ కమీషనర్ ఆర్ కె మీనా ఉత్తర్వులు జారీ చేసారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలియజేసారు. ఈ నెల గిరి ప్రదక్షిణ రద్దు చేయడమే కాకుండా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న జరిగే నాలగవ విడత చందన సమర్పణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు దేవాలయ అధికారులు తెలియజేసారు.
స్వామి వారి గిరి ప్రదక్షిణకు గాని, మొక్కులు చెల్లించుటకు గాని భక్తులకు అనుమతి లేని కారణంగా ఆలయానికి రావద్దని సూచించారు. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు కింద కేసులు నమోద చేస్తామని కమీషనర్ వెల్లడించారు.
ఇప్పటికే పలు జేవాలయాలల్లో ఆలయ సిబ్బందికి కరోనావైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.