Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సంపేటలో మహిళ కానిస్టేబుల్ హల్‌చల్

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (13:01 IST)
వరంగల్ జిల్లా నర్శంపేట డివిజనులోని చెన్నారావు పేట మండలంలోని శంకర్ తండాకు చెందిన పూల్యా నాయక్ అనే వ్యక్తి స్థానిక నర్సంపేట ఎన్జీవోస్ కాలనిలో నివాసం ఉంటున్నాడు. నర్సంపేటలో పోలీసు స్టేషనులో విధులు నిర్వహిస్తున్న రాధిక అనే మహిళ కానిస్టేబుల్ పూల్యా ఇంటి పక్కనే స్థలం కొని ఇల్లు కట్టుకుంటున్న క్రమంలో ఆదివారం పూల్యా నాయక్ ఇంటికి తన కోడలు ఇంటికి వచ్చి భూమి విషయంలో, పంపకాల విషయంలో అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్న క్రమంలో కానిస్టేబుల్ వ్యభిచారం చేయడానికి వచ్చారా? అని సదరు మహిళలను నిలదీసింది. 
 
నన్ను వ్యభిచారంటావా అంటూ పుల్యా కోడలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వు పోలీస్‌వేనా? డ్యూటి ఎట్లా చేస్తావో చూస్తాం అంటూ తన ద్విచక్రవాహనంపై  బయటకు వెళ్ళింది. ఈ మాటలు విన్న రాధిక తన భర్తతో పాటు పూల్యా వాహనంను వెంబడించి స్థానిక ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు రాగానే వాహనాన్ని ఆపి పూల్యాతో పాటు పూల్య కోడలును తీవ్రంగా కొట్టారు.
 
దంతా తతంగం ఆరగంట సేపు జరిగినప్పటికి ఎవరు ఆపకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనంతరం ఇరువర్గాలు స్థానిక స్టేషన్‌కు చేరుకొని ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈ ఘటన జరుగుతున్న క్రమంలో ఎంత పోలీస్ అయితే మాత్రం చట్టాన్ని చేతులోకి తీసుకొని రౌడీలాగా గిరిజనులను నడి బజారులో కొట్టడం దారుణమని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments