Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో రెచ్చిపోయిన సైకోలు.. ఇద్దరు మహిళల గొంతు కోశారు...

Advertiesment
ఏపీలో రెచ్చిపోయిన సైకోలు.. ఇద్దరు మహిళల గొంతు కోశారు...
, మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళల గొంతుకోశారు. ఈ దారుణ ఘటనలు గుంటూరు, కడప జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లె మండలం, పేటేరు గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ రోడ్డుపై వెళుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గొంతుకోసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రవంగా గాయపడిన నిర్మలను ఇతర పాదాచారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నూర్ బాషా కాలనీలో ఓ మహిళపై దస్తగిరి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అదే కాలనీకి చెందిన సుబ్బలక్షమ్మ అనే మహిళ ఉదయాన్నే పాల కోసం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై ఆయా ప్రాంతానికు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఉరేసుకున్న యువకుడు