Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హజీపూర్ సైకో లవర్ : ఎఫ్.బి ప్రొఫైల్ పిక్‌లో మరో యువతి... ఎవరామె?

Advertiesment
Hazipur Psycho
, శనివారం, 4 మే 2019 (12:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హజీపూర్‌లో ఇటీవల వెలుగు చూసిన వరుస హత్య కేసులో మరో ట్విస్ట్ సంభవించింది. హజీపూర్‌ సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డి ఫేస్‌బుక్ ప్రొపైల్ పిక్‌లో మరో అమ్మాయి ఫోటో ఉంది. ఈ అమ్మయితో కలిసి ఫోటో దిగి దాన్ని తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. ఇపుడు ఈ అమ్మాయి ఎవరు.. ఏ ప్రాంతానికి చెందినదన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సైకోగా మారిన మర్రి శ్రీనివాసరెడ్డి లిఫ్టు పేరుతో అమ్మాయిలను ట్రాఫ్ చేసి వారిని మాయమాటలతో నమ్మించి తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తూ చంపేసి అక్కడే పాతిపెట్టాడు. ఇలా ముగ్గురు అమ్మాయిలను హత్య చేశాడు. 
 
అయితే, ఈ సైకో కిల్లర్‌కు ఫేస్‌బుక్‌లో పెద్ద సంఖ్యలో స్నేహితులు ఉన్నారు. అతడి ఫేస్‌బుక్‌ ఖాతాలో 327 మంది స్నేహితులు ఉన్నారు. వారిలో 60మందికి పైగా అమ్మాయిలే. సైకో కిల్లర్‌.. ఫేస్‌బుక్‌లో ఒక యువతితో అత్యంత సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీని ప్రొఫైల్‌ పిక్‌గా అప్‌లోడ్‌ చేసుకున్నాడు. 
 
ఆ యువతి అతడి ప్రియురాలిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆ యువతితో పరిచయం ప్రేమగా మారడం, పెళ్లికి అంగీకరించడంతో ఆమెకు ఏ హానీ తలపెట్టనట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, వరంగల్‌ కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న శ్రీనివాస్ సరెడ్డిని తమకు అప్పగించాలంటూ రాచకొండ పోలీసులు శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో శ్రీనివాస్‌ రెడ్డి బెయిల్‌ కోసం చేసే ప్రయత్నాలేవీ సఫలం కాకుండా.. వీలైనన్ని పక్కా ఆధారాలను సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నదిలోకి దూసుకెళ్లిన విమానం.. క్షేమంగా ప్రయాణికులు