Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలక్షేపం కోసం ఫేస్‌బుక్ చాటింగ్... పచ్చని సంసారంలో చిచ్చు... ఆపై బలవన్మరణం

భర్త కుటుంబ పోషణ కోసం సంపాదనకు బయటకు వెళితే.. తాను ఒంటరిగా ఉండలేక... కాలక్షేపం కోసం ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసిన పాపానికి పచ్చని సంసారంలో చిచ్చురేగింది. ఇది చివరకు ఆమె బలవన్మరణానికి దారితీసింది. ఈ వివరా

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (18:04 IST)
భర్త కుటుంబ పోషణ కోసం సంపాదనకు బయటకు వెళితే.. తాను ఒంటరిగా ఉండలేక... కాలక్షేపం కోసం ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసిన పాపానికి పచ్చని సంసారంలో చిచ్చురేగింది. ఇది చివరకు ఆమె బలవన్మరణానికి దారితీసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతానికి చెందిన పావని రెడ్డి అనే యువతి రెండేళ్ల క్రితం ఎస్కే అహ్మద్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి సంసారంలో సమస్యలు లేవు కదా సజావుగా సాగిపోతూ వచ్చింది. 
 
అయితే, భర్త సంపాదన నిమిత్తం బయటకు వెళ్లేవాడు. దీంతో పావని రెడ్డి ఒక్కటే ఇంట్లో ఉండేది. ఆ సమయంలో కాలక్షేపం కోసం ఓ డమ్మీ ఐడీ క్రియేట్ చేసుకుని దాంతో చాటింగ్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో మదనపల్లిలోని బజాజ్ షోరూం యజమానిగా సుజిత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. 
 
వీరిద్దరి మధ్య సాగుతూ వచ్చిన స్నేహం చివరకు ప్రేమగా మారి నగలు, డబ్బు, స్కూటీ వంటి విలువైన బహుమతులను పావనికి అందించే స్థాయికి చేరింది. ఆ తర్వాత వీరిద్దరు ఒరిజినల్ ఫోటోలు షేర్ చేసుకోవాలని ఇద్దరూ అనుకుని ఆ ప్రకారంగానే ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు చేసిన సుజిత్... పావనికి పెళ్లై పోయిందన్న విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. 
 
దీంతో తాను ఆమెపై ఖర్చు పెట్టిన రూ.2 లక్షలనూ ఇవ్వకుంటే రచ్చ చేస్తానని బెదిరించాడు. చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో బ్యాంక్ కోచింగ్‌కు వెళుతున్నానని చెప్పిన పావని మదనపల్లికి చేరుకుని, తన వద్ద ఉన్న రూ.15 వేలు తీసుకుని ఈ విషయం గురించి మరచిపోవాలని సుజిత్‌ను వేడుకుంది. 
 
అయితే, తాను మోసపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని సుజిత్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పావని బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments