Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంకుబాగోతానికి అడ్డుగా ఉన్నారనీ...

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (07:17 IST)
ఓ మహిళ అతి కిరాతకంగా ప్రవర్తించింది. పేగు తెంచుకుని జన్మించిన ఇద్దరు పిల్లలను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనీ హతమార్చింది. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రిలో వెలుగులోకి వచ్చింది. 
 
ఆనంద్‌ నగర్‌లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు కూతురు చిన్మయి, కుమారుడు మోహిత్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 13 యేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది.
 
అయితే తరచూ పిల్లలను కొడుతుండటంతో అనూష తల్లి కనకదుర్గ.. ఆమెను మందలించింది. దీంతో కనకదుర్గను అనూష గాయపర్చింది. కాగా, ఆదివారం రాత్రి తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. 
 
కాగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నది. చిన్నారుల మృతదేహాను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితురాలు అనూషను అరెస్టు చేశారు. ఆమెపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments