Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాకు వద్దన్న భర్త.. కృష్ణా నదిలో దూకిన భార్య... ఎక్కడ?

సినిమాకు తీసుకెళ్లమంటే భర్త వద్దన్నాడని ఓ భార్య క్షణికావేశానికిగురై కృష్ణానదిలో దూకింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (06:18 IST)
సినిమాకు తీసుకెళ్లమంటే భర్త వద్దన్నాడని ఓ భార్య క్షణికావేశానికిగురై కృష్ణానదిలో దూకింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విజయవాడకు చెందిన రాజారెడ్డి, తిరుపతమ్మ అనే దంపతులు ఉన్నారు. అయితే, తిరుపతమ్మకు సినిమా చూడాలని ఆశకలిగింది. దీంతో తనను సినిమాకు తీసుకెళ్లమని భర్తను కోరింది. దీనికి ఆయన నిరాకరించాడు. ఫలితంగా ఆవేశానికి లోనైన తిరుపతమ్మ కృష్ణా నదిలో దూకేసింది.
 
ఒక్కసారి షాక్‌కు గురైన భర్త... భార్యను కాపాడేందుకు నదిలో దూకాడు. ఇంతలో అటుగా వెళుతున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు... నీళ్లలో భార్యాభర్తలిద్దరూ కొట్టుకుపోతున్నట్లు గమనించాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ నదిలో దూకి వారిని ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 
 
ఈ ఘటనకు పాల్పడిన భార్యాభర్తలిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. భార్యాభర్తలిద్దరినీ ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments