Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లేడు.. గ్యాస్ స్టౌవ్ మెకానిక్‌తో ఆ సంబంధం.. తండ్రి అడ్డు తగిలాడని?

మానవీయ విలువలు, అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ల ప్రభావంతో హత్యలకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాము కోరుకున్న దానికోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. తాజాగా వివాహేతర సంబం

Webdunia
గురువారం, 12 జులై 2018 (18:46 IST)
మానవీయ విలువలు, అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ల ప్రభావంతో హత్యలకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాము కోరుకున్న దానికోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధానికి కన్నతండ్రి అడ్డుతగులుతున్నాడని ఓ కుమార్తె ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చింది. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిని లింగమనేని శేషుకుమారి భర్త 2011లో చనిపోయాడు. కుమారుడి చదువు కోసం ఆమె నూజివీడులోని తుమ్మలవారి వీధిలో అద్దెకు ఉంటోంది. ఆమెకు తోడుగా తండ్రి కూడా కుమార్తె వద్దే వుంటూ.. ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన గ్యాస్‌ స్టౌవ్‌ మెకానిక్‌ వేముల వెంకటేశ్వరరావుతో శేషుకుమారి అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను హెచ్చరించాడు. అంతే.. ఇక తండ్రిని వదిలించుకోవాలనుకుంది. 
 
జూన్‌ 30వ తేదీ రాత్రి పది గంటల సమయంలో ప్రియుడు వెంకటేశ్వరరావుతో కలిసి తండ్రి కృష్ణప్రసాద్‌ను శేషుకుమారి హతమార్చింది. ఈ ఘటనపై గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, తండ్రిని గుర్తు పట్టి వచ్చామని పోలీసులను శేషుకుమారి నమ్మబలికింది. పింఛను కోసం తన తండ్రి వెళ్లాడని, ఫోన్ కూడా తీసుకెళ్లలేదని చెప్పింది. 
 
కానీ అనుమానంతో పోలీసులు కేసుపై దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటాను, నూజివీడు నుంచి శవం పడేసిన స్థలం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. శేషుకుమారి, ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండుకు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments