Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు డ్రైవర్‌ను కాలితో తన్ని చితకబాదిన మహిళ... ఎక్కడ?

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (07:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అధికార పార్టీ నేతలే కాదు కొందరు మహిళలు కూడా రెచ్చిపోతున్నారు. సహనం కోల్పోయి విర్రవీగిపోతున్నారు. తాజాగా బస్సు డ్రైవర్‌పై ఓ మహిళ దాడి చేసింది. కాలితో తన్ని చితకబాందింది. ఈ ఘటన విజయవాడ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీఎస్ ఆర్టీసీ విద్యాధరపురం డిపోకు చెందిన బస్సు ఒకటి ప్రకాశం రోడ్డులో వెళుతున్నది అదేసమయంలో ఆంధ్రా ఆస్పత్రి సమీపంలో కృష్ణలంక తారకరామ నగర్‌కు చెందిన నందని అనే మహిళ ద్విచక్రవాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డంగా వచ్చింది.
 
దీంతో ప్రమాదం జరుగకుండా బస్సు డ్రైవర్ ముసలయ్య సడెన్ బ్రేక్ వేశారు. అప్పటికీ ఆమె బైక్‌కు సమీపంలో వచ్చి ఆగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ బడిని అక్కడే నిలిపి.. బస్సెక్కి డ్రైవర్‌పై దాడి చేసింది. చొక్కాపట్టుకుని లాగి చింపేసింది. కాలితో తన్నింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. 
 
ఈ రగడ దెబ్బకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను, మహిళను ఠాణాకు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈమెకు అధికార పార్టీకి చెందిన ఓ నేత అండదండలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments