Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఓటింగ్ ప్రారంభం

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఓటింగ్ ప్రారంభం
, బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (23:22 IST)
నిరీక్షణ ముగిసింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్(ISWOTY) థర్డ్ ఎడిషన్ నామినీలను ప్రకటించారు. సోమవారం నుంచి పబ్లిక్ ఓటింగ్ ప్రారంభమవుతుంది. క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, క్రీడా రచయితలతో కూడిన ప్రత్యేక జ్యూరీ షార్ట్ లిస్ట్ చేసిన ఐదుగురు BBC ISWOTY నామినీలు వీరే...
 
* అదితీ అశోక్, గోల్ఫ్ క్రీడాకారిణి
* అవని లేఖరా, పారా షూటర్
* లవ్లీనా బోర్గోహెయిన్, బాక్సర్
* పీవీ సింధు, షట్లర్
* సైఖోమ్ మీరాబాయి చాను, వెయిట్ లిఫ్టర్

 
ఆన్ లైన్ ఓటింగ్ ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11:30 వరకూ కొనసాగుతుంది. విజేతను 2022 మార్చి 28న ఢిల్లీలో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. బీబీసీ న్యూస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సీనియర్ కంట్రోలర్, బీబీసీ వరల్డ్ డైరెక్టర్ లిలియానే లాండార్ దీనిపై మాట్లాడారు.

 
"బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు భారత క్రీడాకారిణులు అసాధారణ విజయాలను హైలెట్ చేయడాన్ని కొనసాగిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. ఈ ఏడాది నామినీలు వారివారి క్రీడల్లో స్ఫూర్తిదాయకమైన మహిళలు, లీడర్లు, ఈ అవార్డు గెలుచుకోవడానికి వారందరూ అర్హులే. అయితే మా ప్రేక్షకులు మా ఫ్లాట్ ఫాంల ద్వారా ఓటు వేసి, విజేతను ఎంపిక చేస్తారు" అని వివరించారు.

 
బీబీసీ న్యూస్, ఇండియా హెడ్ రూపా ఝా మాట్లాడుతూ.. నామినీల పేర్లు వెల్లడించటం చాలా ఆనందాన్నిస్తోంది. BBC ISWOTY ప్రతి ఎడిషన్ నామినేషన్లోనూ కొన్ని పేర్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఐదుగురు నామినీలు అనేక క్రీడలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గోల్ఫ్ క్రీడాకారిణి నుంచి పారాలింపియన్ వరకూ భారత క్రీడల్లో వెలుగుతున్న తారలు వీరు. వీరిని సెలబ్రేట్ చేసుకుందాం" అన్నారు.

 
ఈ అవార్డు వేడుకలో బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఒక లెజండరీ క్రీడాకారిణిని కూడా సత్కరిస్తారు. ఒక యువ క్రీడాకారిణిని బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేస్తారు. గత ఏడాది బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విజేత అంజూ బాబీ జార్జ్... భారత క్రీడారంగం ప్రస్తుత పరిస్థితిపై ఆశాభావం వ్యక్తం చేసారు.

 
"ప్రతిభావంతులైన క్రీడాకారిణిలను ప్రోత్సహించడానికి భారత్ తగినంతగా కృషి చేస్తోంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నారు. అయితే మనకు మంచి క్వాలిఫైడ్ కోచ్‌ల అవసరం వుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లోకి పంపాలని కోరుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి" అన్నారు.

 
BBC ISWOTY అవార్డుకు షార్ట్ లిస్ట్ అవడం పట్ల నామినీలు ఇలా ప్రతిస్పందించారు:
2020 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన అదితీ అశోక్.. "ఆ సంవత్సరం నాకు చాలా బాగుంది. కొన్నిసార్లు బాగా రాణించాను. నేను కొన్ని మెరుగైన ప్రదర్శనలు చేసాను. అందుకు నేను కృతజ్ఞురాలిని. భారతదేశంలో గోల్ఫ్ మరింతగా ప్రజాదరణ పొందుతున్నందుకు నాకు సంతోషంగా వుంది" అన్నారు.

 
పారాలింపిక్స్ ఈవెంట్లో స్వర్ణపతకం గెలిచిన తొలి భారత మహిళ అవనీ లేఖరా... "గత ఆరేళ్లుగా నేను పడిన కష్టానికి గుర్తింపు లభిస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. 2024 పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవాలనేది నా లక్ష్యం" అని చెప్పారు. టోక్యో 2020లో కాంస్య పతకం గెలిచిన లోవ్లీనా బోర్గోహెయిన్..."మనం మహిళలం కాబట్టి, బాలికలం కాబట్టి ఏదైనా ఒక పనిని చేయలేం అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మహిళలు అన్నీ చేయగలరు. మనమంతా సమానం" అన్నారు.

 
వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారత మహిళ పి.వి.సింధు... "విజయం సులభంగా అందదు. కొన్ని నెలలు కష్టపడితే కాదు... కొన్నేళ్లు కష్టపడి పనిచేయాలి. ప్రతిరోజూ కష్టపడాలి. అప్పుడే మనం ఓ స్థాయికి చేరుకోగలం" అని పేర్కొన్నారు.

 
2017 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం, టోక్యో 2020లో రజత పతకం గెలిచిన మీరాబాయి చాను... "అమ్మాయిలు భారీ బరువులు ఎత్తలేరు, అలా చేస్తే మహిళల శరీరం పాడవుతుంది అని జనం అంటుంటే విన్నా. కానీ అది నిజం కాదు. నాకు ఏం జరగలేదు" అని చెప్పారు.

 
ఓటింగ్ సమాచారం: ఎవరైనా ఆన్ లైన్లో ఇక్కడ BBC ISWOTY Voting Page ఉచితంగా ఓటు వేయవచ్చు. ఓటింగ్ నిబంధనలు, షరతులను Voting terms and conditions ఇక్కడ చూడవచ్చు.

 
ఈ ఏడాది నామినీల స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి బీబీసీ భారతీయ భాషా వెబ్ సైట్లలో వరుసగా లోతైన కార్యక్రమాలు అందిస్తాం. బీబీసీ వరల్డ్ న్యూస్ ఫిబ్రవరి 19న శనివారం రాత్రి 11 గంటలకు, ఫిబ్రవరి 20న ఆదివారం ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు నామినీల గురించి ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేస్తుంది. భారతదేశంలోని మహిళా పారా అథ్లెట్లు ఎదుగుదల గురించి బీబీసీ స్పోర్ట్ ఒక ప్రత్యేక కథనం అందిస్తుంది.

 
ఎడిటర్లకు సూచన
2022 బీబీసీ శతాబ్ది సంవత్సరం. కార్పొరేషన్ మొదటి రేడియో స్టేషన్‌ను 1922లో ప్రారంభించింది. మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి: https://www.bbc.co.uk/historyofthebbc/bbc-100/timeline/

 
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2022 నామినీలు
అదితి అశోక్
వయసు 23, గోల్ఫర్
ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి భారత మహిళల గోల్ఫ్ క్రీడకు మారుపేరుగా నిలిచారు అదితి అశోక్. కేవలం 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నారు. ఆ ఏడాది ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందంలో అతి పిన్న వయస్కురాలామె. తరువాత 2020 టోక్యో ఒలింపిక్స్ మహిళల గోల్ఫ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. గోల్ఫ్ లో అదితి సాధించిన విజయం భారతదేశంలో మహిళల గోల్ఫ్ పైన ఆసక్తిని పెంచింది. 2016లో లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంటును గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి ఆమె.

 
అవనిలేఖర
వయసు 20, పారాషూటర్
పారాలింపిక్స్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా 20 ఏళ్ల అవని లేఖర చరిత్ర సృష్టించారు. టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పారు. అదే ఒలింపిక్స్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ SH1లో కూడా అవని కాంస్యం గెలుచుకున్నారు. చిన్నతనంలో జరిగిన ఒక పెద్ద కారుప్రమాదంలో ఆమె నడుము నుంచి కింది భాగానికి పక్షవాతం వచ్చింది. ఆ ప్రమాదం తర్వాత అవని తండ్రి ఆమెకి షూటింగ్ క్రీడను పరిచయం చేసారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. క్రీడలపై వున్న మక్కువను కొనసాగిస్తూనే ఆమె లా చదువుతున్నారు.

 
లవ్లీనా బోర్గోహెయిన్
వయసు 24, బాక్సర్
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించారు లవ్లీనా బోర్గోహెయిన్. దాంతో ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్‌గా రికార్డు నెలకొల్పారు. వివిధ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలను గెలుచుకున్నారామె. 2018లో ప్రారంభమైన ఇండియా ఓపెన్లో స్వర్ణం గెలుచుకుని తొలిసారిగా ఆమె వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో జన్మించిన 24 ఏళ్ల లవ్లీనా తన ఇద్దరు అక్కలను స్ఫూర్తిగా తీసుకుని కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. భారత మహిళల బాక్సింగులో తనదైన ముద్ర వేసారు.

 
మీరాబాయిచాను
వయసు 27, వెయిట్ లిఫ్టర్
వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చాను 2021 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశానికి తొలి పతకాన్ని సాధించిన ఘనత ఆమెదే. 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో ఓటమి నుంచి టోక్యోలో గెలుపు వరకూ మీరాబాయి ప్రయాణం మరిచిపోలేనిది.

 
ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో జన్మించారు మీరాబాయి చాను. ఆమె తండ్రి ఒక టీ స్టాల్ నడిపేవారు. కెరీర్ తొలి దశలో ఆమె అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగారు.

 
పి.వి. సింధు
వయసు 26, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు (పి.వి.సింధు) ఒలింపిక్స్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ. 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం, 2021 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజతం సాధించి 2021 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించారు సింధు.

 
2022 జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారామె. సింధు 17 సంవత్సరాల వయసులోనే 2012 సెప్టెంబరులో బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్సులో టాప్ 20 లోకి అడుగుపెట్టారు. 2019 సంవత్సరానికి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు.

 
జ్యూరీ సభ్యులు ఎవరంటే...
ఆదేశ్ కుమార్ గుప్త్, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
ఐశ్వర్య కుమార్ లక్ష్మీనారాయణపురం, ఈఎస్పీఎన్, స్టాఫ్ రైటర్
ఆర్చీ కళ్యాణ, బీబీసీ స్పోర్ట్, డైవర్సిటీ ప్రొడ్యూసర్, క్రికెట్
సీ వెంకటేశ్, జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్
దీప్తి పట్వర్థన్, ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
జైల్స్ గోఫోర్డ్, బీబీసీ స్పోర్ట్, గ్లోబల్ డెవలప్మెంట్ ప్రొడ్యూసర్
హర్పాల్ సింగ్ బేడీ, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
హేమంత్ రస్తోగి, అమర్ ఉజాలా, న్యూస్ ఎడిటర్
జాహ్నవి మూలే, బీబీసీ న్యూస్ జర్నలిస్ట్
కమల్ వరదూర్, చంద్రిక డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్
కే విశ్వనాథ్, మాతృభూమి డైలీ కేరళ, అసిస్టెంట్ ఎడిటర్
మనుజ వీరప్ప, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ ఎడిటర్ స్పోర్ట్స్
మహ్మద్ ఇంతియాజ్, ది బ్రిడ్జ్, కంటెంట్ మేనేజర్
నీరు భాటియా, ది వీక్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ బ్యూరో, స్పోర్ట్స్ రచయిత
నిఖిల్ నాజ్, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
నోరిస్ ప్రీతమ్, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
పంకజ్ ప్రియదర్శి, బీబీసీ న్యూస్, సీనియర్ జర్నలిస్ట్
ప్రసేన్ మోద్గల్, స్పోర్ట్స్ క్రీడా, క్రికెట్ అండ్ ఇండియన్ స్పోర్ట్స్ మేనేజర్
ప్రశాంత్ కేని, లోక్ సత్తా, అసిస్టెంట్ ఎడిటర్ (స్పోర్ట్స్)
రాజేంద్ర సజ్వాన్, పబ్లిక్ ఆసియా, నేషనల్ స్పోర్ట్స్ ఎడిటర్
రాజీవ్ మేనన్, మలయాళ మనోరమ, స్పెషల్ కరెస్పాండెంట్
రాకేశ్ రావ్, ది హిందూ, డిప్యూటీ ఎడిటర్ (దిల్లీ స్పోర్ట్స్ బ్యూరీ చీఫ్)
రవ్‌దీప్ సింగ్ మెహతా, ఇండియా ఆల్ స్పోర్ట్స్(ట్విట్టర్) ఫౌండర్
రెహాన్ ఫజల్, బీబీసీ న్యూస్, సీనియర్ జర్నలిస్ట్
రీకా రాయ్, ఎన్‌డీటీవీ, స్పోర్ట్స్ ఎడిటర్
రూపా ఝా, హెడ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, బీబీసీ న్యూస్
సదైయండి ఏ, న్యూస్ 18 తమిళనాడు, సీనియర్ కరస్పాండెంట్
సంబిత్ మహోపాత్రా, నిర్భయ్, ఒడియా డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్
సరజు చక్రవర్తి, స్యందన్ పత్రిక, త్రిపుర, స్పోర్ట్స్ ఎడిటర్
సౌరభ్ దుగ్గల్, స్పోర్ట్స్ గావ్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేటెడ్ విత్ పిక్స్ స్టోరీ
షాలినీ గుప్తా, హిందుస్థాన్ టైమ్స్ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్, స్పోర్ట్స్
శారదా ఉగ్రా, ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
ఎస్ సబానాయకన్, ఈస్టర్న్ క్రానికల్, ఎడిటర్
సుబోధ్ మల్లా బారువా, దైనిక్ అసోం, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో(స్పోర్ట్స్)
సురేష్ కుమార్ స్వైన్, సంబాద్, ఒడియా డైలీ స్పోర్ట్స్ ఎడిటర్
సూర్యాంశి పాండే, బీబీసీ న్యూస్, జర్నలిస్ట్
సూసన్ నినాన్ ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ రచయిత
తుషార్ త్రివేది, నవ్ గుజరాత్ సమయ్, స్పోర్ట్స్ ఎడిటర్
వందన, బీబీసీ న్యూస్, టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్
విజయ్ లోకపల్లి, స్పోర్ట్ స్టార్, ఎడిటోరియల్ కన్సల్టంట్
విపుల్ కశ్యప్, ఏఎన్ఐ, స్పోర్ట్స్ కరస్పాండెంట్
వీవీ సుబ్రహ్మణ్యం, ది హిందూ, డిప్యూటీ ఎడిటర్, స్పోర్ట్స్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ.. రేపు చిరుతో సమావేశం