వైసీపీని మళ్లీ గెలిపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (18:58 IST)
మూడు రాజధానుల రెఫరెండంతో ఎన్నికలు వెళ్లాలని టీడీపీ నేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైసీపీనే సమర్థిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

విజయవాడ బెంజ్​సర్కిల్​లో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. . జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందన్నారు.

వేల సంవత్సరాల క్రితమే రాజ్యంగా ఉన్న.. అమరావతి చారిత్రక ప్రాధాన్యత కాపాడుకోవాలని సూచించారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకుంటున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు.

ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైసీపీనే సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments