Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి సీటు కోసం పవన్ మల్లగుల్లాలు.. బీజేపీ నో.. ఏం జరుగుతుందో?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (18:23 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలనుకుంటోంది. అయితే జనసేన కూడా తిరుపతి కోసం మల్లగుల్లాలు పడుతోంది. తిరుపతి ఎంపీ సీటును గెలుచుకోవడం కోసం కమలనాథులు వెంకన్న సన్నిధిలో కమలం జెండా ఎగరేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారీ వ్యూహాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. 
 
లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను బేరీజు వేసుకుని ఓ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని కూడా దాదాపు ఖాయం చేసినట్టు పార్టీలోని అంతర్గత సమాచారం. గుంటూరు జిల్లా నుంచి గతంలో టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఆ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 
 
ఆ దళిత నేత పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో అక్కడ కొంచెం పేరున్న దళిత నేతను బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 
 
కానీ తిరుపతి ఉప ఎన్నికల టికెట్ తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసి.. కమలానికి జై కొట్టారు. అంతేగాకుండా తిరుపతి సీటు మాకే కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.  
 
తిరుపతి సీటు తమకు ఇవ్వాలని కోరుతున్నందునే పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీలో బీజేపీకి జై కొట్టినట్టు చెబుతున్నారు. అయితే, గతంలో ఓ సారి అక్కడ గెలిచిన తాము మరే పార్టీకి ఇవ్వబోమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీ పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇవ్వనున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి ఏమౌతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments