Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తుఫాన్ బీభత్సం.. ఏపీలో అలెర్ట్.. 45-65కిలోమీటర్ల వేగంతో గాలులు

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (17:24 IST)
నివర్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. నీరవ్ తుఫాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం, ఆ తర్వాత ఆరు గంటల్లో వాయుగుండం బలహీనపడనుందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 
 
చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో విస్తారంగా భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
 
కాగా, తుఫాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశించారు. అవసరమైతే తాగునీరు, పారిశుధ్యం పనులు చేపట్టాలన్నారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్‌ ప్యాకెట్లు తక్షణమే సరఫరా చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments