Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

నివర్ తీవ్రతరం, బుధవారం అర్థరాత్రి తీరం దాటనున్న పెనుతుఫాన్

Advertiesment
నివర్ తీవ్రతరం, బుధవారం అర్థరాత్రి తీరం దాటనున్న పెనుతుఫాన్
, బుధవారం, 25 నవంబరు 2020 (20:22 IST)
నివర్ తుఫాన్ తీవ్రతరమైంది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతమైన మమల్లాపురంలో పెనుగాలులు, భారీ వర్షం పడుతోంది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. మెట్రో సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని అధికారులు తెలిపారు.
 
తీరప్రాంత తమిళనాడుకు సమీపంలో "చాలా తీవ్రమైన తుఫాను" గా నివర్ కేంద్రీకృతమై వుంది. ఈ శక్తివంతమైన తుఫాను పుదుచ్చేరి సమీపంలో, అర్ధరాత్రి లేదా రేపు వేకువ జామున తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను తమిళనాడులోని మామల్లపురం (రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది) మరియు పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య తీరాన్ని తాకవచ్చు.
 
తీరప్రాంత తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు మరియు బలమైన గాలులు నివర్ ప్రభావంతో వీస్తున్నాయి. చెన్నైతో సహా తమిళనాడులోని 13 జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు దినం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం