'పల్లె' ఫలితాలు తెచ్చిన జోరు.. ఆ ఎన్నికలకు సై అంటున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార వైపాకా మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం స్థానాల్లో 80 శాతానికి పైగా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చ జరిగింది. 
 
ముఖ్యంగా, గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు సానుకూల ఫలితాలు రావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ మంత్రులకు వివరించారు.
 
ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం మంత్రులను అభినందించారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామన్నారు. 
 
కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై  అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
అంతకుముందు సీఎం అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments