'వై నాట్ పులివెందుల - ఇదే మా నినాదం ' : టీడీపీ నేత బీటెక్ రవి

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (08:38 IST)
తాజాగా వెల్లడైన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయభేరీ మోగించడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ వచ్చింది. దీంతో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై కన్నేశారు. "వై నాట్ పులివెందుల" అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సీఎం జగన్ "వై నాట్ 175" అంటూ వ్యాఖ్యానిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు "వై నాట్ పులివెందుల" అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 
 
ఇదే విషయంపై టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ, వైకాపా నేత, మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపిన ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. సొంత ఇంటి మనిషిని ఇంత క్రూరంగా చంపడం ఏమిటన్నది ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లిందన్నారు. 
 
ఈ కారణం వల్ల కూడా వైకాపాకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయని తెలిపారు. మొన్నటివరకు రాష్ట్రంలో 86 శాతం మందినికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటూ ప్రచారం చేసిన వైకాపా పెద్దలు.. ఎమ్మెల్సీ ఫలితాలతో ఆ లెక్కలు పక్కనబెట్టి వారికి ఎవరికీ తమ పథకాలు అందడం లేదంటూ కారణాలు చెప్పడం మొదలుపెట్టారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

Arjun: నాలుగు రోజుల్లో 8.7 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన సీతా పయనం

Hebba Patel: మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments