Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితులను ఎందుకు ఎన్‌కౌంటర్ చేశామంటే....

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (09:58 IST)
దేశంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసు రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా, ఘటనా స్థలానికి నలుగురు నిందితులను శుక్రవారం వేకువజామున గట్టిభద్రత మధ్య తీసుకెళ్లారు. అక్కడ పోలీసులపై నలుగురు నిందితులు తిరగబడ్డారు. అంటే.. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కొని వారిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ, దిశ హత్య కేసు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆ పరిస్థితుల్లో తప్పనిసరై తాము ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన శుక్రవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, ఈ తెల్లవారుజామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారని, ఆ వెంటనే ఫైరింగ్‌ను ఓ పెన్ చేశారని తెలిపారు. ఆత్మ రక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని, తామేమీ ఎన్‌కౌంటర్ చేసి వారిని హతమార్చాలన్న ఆలోచనలో లేమని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments