Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం - అయ్యప్పదీక్షల ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గత 20 రోజుల్లో వీటి ధరలు 22 శాతం మేరకు తగ్గాయి. దీనికి కారణం కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు. ఈ రెండింటి కారణంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అంటే డిమాండ్ తగ్గిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. 
 
ఈ కారణంగా గత 20 రోజుల్లో ఏకంగా 22 శాతం మేరకు తగ్గాయి. నవంబరు 3వ తేదీన లైవ్ చికెన్ ధర కిలో రూ.140గా ఉంటే, ఇపుడు అది రూ.126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్‌లెస్ చెకెన్ ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. చికెన్ ధరల తగ్గుదలపై వ్యాపారులు స్పందిస్తూ, కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల కారణంగా డిమాండ్ తగ్గిపోయిందని, అదేసమయంలో చికెన్ సరఫరా పెరిగిందన్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వివరించారు 
 
కాగా, గత నెల 29వ తేదీన కార్తీక మాసం ప్రారంభమైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అనేక మంది హిందూ ప్రజలు మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ఈ నెల 17వ తేదీ నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది అయ్యప్ప దీక్షామాలను ధరించడంతో వారు కూడా మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణాలతోనే చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయని వ్యాపారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments