Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రమ్మంటారు.. మోదీ వద్దంటారు.. ఏంటిదంతా...? హరిబాబు గుర్రు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ బిజెపిలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కొంతమందికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామని చెప్పి వారికి మొండిచేయి చూపడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందులో ఏపీకి చెందిన హరిబాబు, పార్టీపై గుర్రుగా ఉన్నారు. కేంద్రమంత్రి పదవి ఇస్తాం..

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (15:47 IST)
కేంద్ర మంత్రివర్గ విస్తరణ బిజెపిలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కొంతమందికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామని చెప్పి వారికి మొండిచేయి చూపడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందులో ఏపీకి చెందిన హరిబాబు, పార్టీపై గుర్రుగా ఉన్నారు. కేంద్రమంత్రి పదవి ఇస్తాం... కుటుంబ సభ్యులతో కలిసి రమ్మని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వస్తే ఉన్నఫలంగా బయలుదేరారట హరిబాబు. విజయవాడలో ఒక కార్యక్రమంలో ఉన్న హరిబాబు కుటుంబ సభ్యులందరినీ వెంట పెట్టుకుని ఎంతో సంతోషంగా వెళ్ళారు.
 
చివరకు హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వలేదు కదా.. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ఆగ్రహంతో వూగిపోయిన హరిబాబు తన అనుచరుల వద్ద బాధను వెళ్ళగక్కాడట. అమిత్ షా రమ్మంటారు.. మోదీ వద్దంటారు.. ఏంటిదంతా.. నిర్ణయం ఎంతమంది తీసుకుంటారు. ఇది అన్యాయం. ఎన్నో యేళ్ళు పార్టీలో కష్టపడి పనిచేశాను. ఇదా నాకు దక్కే ఫలితం. తగిన శాస్తి జరిగింది. ఇక అవసరం లేదు. పార్టీలో కొనసాగలేను. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తా. 
 
నాకు ఏ పదవులు అవసరం లేదంటూ తన సన్నిహితులతో బాధను వెళ్ళగక్కారట. ఎంపిగా కొనాసాగుతున్న హరిబాబుకు బిజెపి అగ్ర నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలే చివరకు మంచి అవకాశాన్ని వచ్చే విధంగా చేస్తుందనుకున్నారు. కానీ అది నోటి వరకు వచ్చి జారిపోవడంతో హరిబాబు ఓర్చుకోలేకపోతున్నారట. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సీనియర్ బిజెపి నేతలు హరిబాబును బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments