Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్నర్ మత్తులో మహిళల వీరంగం... సాటి మహిళను చావబాదారు

Webdunia
సోమవారం, 6 మే 2019 (11:46 IST)
మత్తు కోసం యువత పెడదోవపడుతున్నారు. గంజాయితో పాటు వివిధ రకాల డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. వీరిలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇపుడు మహిళలు కూడా చేరారు. తాజాగా కొందరు మహిళలు మత్తుకోసం వైట్నర్‌ను పీల్చారు. ఈ ఘటన హైదారాబాద్‌లోని ఫలక్‌నుమాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదన్‌ఖాన్‌ మల్గీ ప్రాంతానికి చెందిన షబానా(32), పర్వీన్‌(30), అయేషా(30), జబీన్‌(31)లు శనివారం సాయంత్రం ఫాతిమానగర్‌కు చెందిన గోరీబీ(50) ఇంటికి వెళ్లారు. అప్పటికే వైట్నర్ మత్తులో ఉన్న వారందరూ కలిసి గోరీబీ కుమార్తె విషయమై ఆమెతో గొడవపడి చేయిచేసుకున్నారు. 
 
ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. అక్కడితో ఆగక గోరీబీ చిన్న కుమార్తె సబాబేగం(13)ను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. దీంతో గోరీబీ నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఓ ఇంట్లో బందీగా ఉన్న సబాబేగంను విడిపించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
ఆ సమయంలో అక్కడే ఉన్న గోరీబీని చూసి రెచ్చిపోయిన నిందితులు పోలీసుల ఎదుటే ఆమెపై దాడికి దిగారు. నోటికి వచ్చినట్టు తిడుతూ కొడుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన మహిళలు పోలీసులపైకి చెప్పులు విసిరారు. మహిళపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తుండటంతో వాటిని ఎలా అదుపు చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments