Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ ప్రేమ... ప్రియుడితో ఏకాంతంగా ఫోటోలు.. భార్య ఫోన్లో ఫోటోలు చూసిన భర్త

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (16:40 IST)
నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త, ఇద్దరు పిల్లలుండగా ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేమాయణం కొనసాగించింది. చివరకు విషయం బయటపడటంతో ప్రియుడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త. నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఇది. 
 
నెల్లూరు వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉండే సలీం, పర్వీన్ భార్యాభర్తలు. పదేళ్ల క్రితం వీరికి పెళ్లైంది, ఇద్దరు పిల్లలున్నారు. సలీం ఆటో మెకానిక్ కాగా, పర్వీన్ ఇంట్లోనే ఉండేది. ఇటీవల ఓ మహిళ ద్వారా పర్వీన్ ఫోన్ నెంబర్ షేక్ షుకూర్ అనే ఆటో డ్రైవర్ తీసుకున్నాడు. అప్పట్నుంచి వాట్సాప్, మెసేజ్‌ల ద్వారా వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. తరచూ ఒకరినొకరు కలుసునేవారు కూడా. 
 
ఈ నేపథ్యంలో ఏకాంతంలో ఉండగా వీరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అయితే ఆ ఫొటోలు భర్తకు దొరకడంతో ఇద్దరి వ్యవహారం బయటపడింది.  భార్య, ప్రియుడితో కలసి ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే భర్తపై దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు. స్నేహితుల సాయంతో అతడిని వెతికి పట్టుకుని తీసుకొచ్చి తన భార్యతో సహా ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. తను తప్పు చేశాని ఒప్పుకున్న షుకూర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి ప్రేమాయణానికి సాక్షిగా ఉన్న సెల్ ఫోన్‌ని, ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments