Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సతీమణి భారతీ రెడ్డికి భాస్కర్ రెడ్డి ఏ వరుసన మేనమామ అవుతారు?

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (08:58 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇందులోభాగంగా, ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డికి స్వయానా మేనమామ. ఈ వరుస ఎలా కలిసిందే ఓసారి పరిశీలిద్ధాం. 
 
భారతి రెడ్డి తల్లి ఈసీ సుగుణమ్మకు భాస్కర్ రెడ్డి సోదరుడు. మరోపక్క భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతి రెడ్డికి మేనత్త అవుతారు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి సోదరే లక్ష్మి. వీరు కుండమార్పిడి వివాహాలు చేసుకున్నారు. వై.ఎస్‌.వెంకట రెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ కుమారుడైన చిన్న కొండారెడ్డి తొమ్మిదో కుమారుడు వై.ఎస్‌.భాస్కర రెడ్డి (అవినాష్‌రెడ్డి తండ్రి). ఆరో కుమార్తె ఈసీ సుగుణమ్మ (భారతి తల్లి).
 
వై.ఎస్‌.వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ అయిదో కుమారుడు వై.ఎస్‌.రాజారెడ్డి. ఆయన కుమారులు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, వై.ఎస్‌.వివేకానందరెడ్డి. వై.ఎస్‌.భాస్కర్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. వరసకు చిన్నాన్న. జగన్‌ భార్య భారతికి అత్యంత దగ్గరి కుటుంబీకుడు. వై.ఎస్‌.భారతి తల్లి ఈసీ సుగుణమ్మ.. వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డికి మేనత్త అవుతారు. అవినాష్‌ రెడ్డి తల్లి లక్ష్మి.. భారతికి మేనత్త అవుతారు. అందుకే కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్‌ ఆప్యాయత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments