Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేశ్ - బ్రాహ్మణిల మధ్య యామిని సాధినేని... ఫ్యామిలీలో మనస్పర్థలు?

Webdunia
సోమవారం, 27 మే 2019 (13:59 IST)
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మంచి అందగత్తెగా ఉన్న యామినిని లోకేశ్‌ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారనే ప్రచారం జరిగింది. దీనికి కారణం వారిద్దరూ చాలా క్లోజ్ అనే ప్రచారం ఉంది. టీడీపీ అధికార ప్రతినిధిగా యామిని నియమితులైన తర్వాత నారా లోకేశ్ ఆయన భార్య నారా బ్రాహ్మణిల మధ్య మనస్పర్థలు తలెత్తాయనీ, దీనికి కారణం లోకేశ్ - యామినిలు చాలా సన్నిహితంగా ఉండటమేనంటూ ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై యామిని తాజాగా స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలు రావడం తనపైనే కాదనీ, గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, వైకాపా మహిళా నేత షర్మిల, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిలపై కూడా వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారి గురించి మాట్లాడేందుకు ఏమీలేదనీ, వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు.
 
పైగా, తాను ముగ్గురు ఆడపిల్లల తల్లిని అని గుర్తుచేశారు. "నాకు పిల్లల భవిష్యత్. వారి బాధ్యత, దాతృత్వం. వ్యాపారంతో పాటు కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి. నేను వీటిలో తలమునకలై ఉన్నాను. అందువల్ల ఈ ఆరోపణలు పట్టించుకోను. పైగా, నా గురించి వాళ్ళకు ఏం తెలుసని ఆ తరహా లింకులు పెట్టి వార్తలు రాయడానికి. అవతల లేడీ కాబట్టి ఆమెపై బుదర చల్లేసి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా ఆనందం వస్తుందని భావించే నెటిజన్ల గురించి నేను అసలు పట్టించుకోను. 
 
ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చినపుడు మంచి ఉంటుంది.. చెడు ఉంటుంది. మనల్ని మెచ్చుకునేవారూ ఉంటారు... మనపై బురదజల్లేవారు కూడా ఉంటారు. చంద్రబాబు ఇంటి లోపలికి యామిని బెంజ్ కారు నేరుగా వెళుతుందని ప్రచారం చేయడంలో అర్థంలేదు. ఇక లోకేశ్ నాకు సోదరుడుతో సమానం. మంచి కుటుంబం, ప్రేమించే భర్త, ఎదిగివచ్చిన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎవరూ కూడా అలాంటి తప్పుడు పనులు చేయరు. నాపై చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నా" అంటూ యామిని సాధినేని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments