Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణ పై శ్రద్ధ ఏది?: చంద్రబాబు విమర్శ

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:52 IST)
కరోనా నియంత్రణపైన ప్రభుత్వం ఎక్కడ శ్రద్ద చూపడం లేదని ప్రతిపక్షనేత ఎన్‌.చంద్రబాబునాయుడు విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీగా ఉందని, ఈ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి వినాశనానికి దారితీస్తుందని విమర్శించారు.

ఆదాయమార్గాలు ఏమీ చూపకుండా మొత్తం అప్పులనే చూపించారని, దీంతో అభివృద్ది ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. అరకొర కేటాయింపులతో అభివృద్ధి ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని అడిగారు. 

అసెంబ్లీ సమావేశాలకు సిఎంతో పాటు మంత్రులు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా వచ్చారని, ప్రజలకు ఏం సందేశాన్నిస్తున్నారని ప్రశ్నించారు. పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్దులు, తల్లితండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments