Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీరో ఎఫ్‌‌ఐఆర్... ఇదొకటుందనే విషయం మీకు తెలుసా?

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (10:51 IST)
జీరో ఎఫ్‌‌ఐఆర్... ఇదొకటుందనే విషయం చాలా మందికి తెలియదు. అంతెందుకు పోలీసు శాఖలో పని చేసే చాలా మంది పోలీసులకే తెలియదు. ఇది ఇపుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే... ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ధగ్గరికి వెళితే అది మాపరిధి కాదు అని శంశాబాద్ పరిధి అనీ కాదు.. కాదు శంశాబాద్ రూరల్ పరిధి అని తిప్పిపంపారు. 
 
ఈ సమస్య ఇప్పుడే కాదు... ప్రతి పోలిస్ స్టేషన్‌లోనూ జరిగే ప్రహసనమే... పోలీసులు చాలా సందర్భాలలో బాధ్యత నుంచి తప్పుకోవడానికి మా పరిధి కాదు అనే ఆయుధాన్ని వాడుతుంటారు. నిజానికి ఇది తప్పు. మనమొక ఫిర్యాదుతో ఏ పోలిస్ స్టేషన్‌కు వెళ్ళినా వారు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని వాళ్ళు అంటే జీరో ఎఫ్‌ఐఆర్ చెయ్యండి అని మనం అడగాలి. అప్పుడు జీరో ఎఫ్ఐఆర్ చెయ్యాల్సిందే..
 
ఇంతకూ జిరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి?
మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తేలనపుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి తర్వాత సంబంధిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్‌ఐ‌ఆర్‌ను ఆ స్టేషన్‌కు పోలీసులు బదిలీ చేయాలి. 
 
ఇంకా చెప్పాలంటే ఏ పరిధిలోదో తెలిసినా సరే మనం ఫిర్యాదును వేరే స్టేషన్‌లో చేసి జీరో ఎఫైఆర్ చేయండి అని అడిగితే అక్కడ నమోదు చేయాల్సిందే. ఇది నియమం. మా పరిధి కాదు అని ఏ పోలిస్ స్టేషనూ అనడానికి వీలు లేదు. జీరో ఎఫ్‌ఐఆర్ గురించి నిజానికి ప్రజల కంటే ముందు పోలిస్ ఆఫీసర్లే తెలుసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments