Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్తే మద్యం మత్తులో యువతిపై రేప్

Webdunia
గురువారం, 13 మే 2021 (11:49 IST)
స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ యువతిపై మద్యం మత్తులో ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది.
 
కాగా, మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణ పురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చారు. స్నేహితుడిని బంధించారు. అతడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.
 
దాంతో బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం (మే 12,2021) అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆడపిల్లల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన దురాఘాతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments