Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటకం మాటున అశ్లీలం... హైదరాబాద్‌ టు సూర్యలంక...

పర్యాటకం మాటున అశ్లీలం నృత్యాలు పెరిగిపోయాయి. ఇవి హైదరాబాద్ నుంచి సూర్యలంక వరకు విస్తరించాయి. హైదరాబాద్‌లో ఫాంహౌస్‌, రిసార్ట్స్‌లలో రహస్యంగా నిర్వహించే ముజ్రా నృత్యాల సంస్కృతి ఇపుడు ఏపీ రాజధాని అమరావత

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:11 IST)
పర్యాటకం మాటున అశ్లీలం నృత్యాలు పెరిగిపోయాయి. ఇవి హైదరాబాద్ నుంచి సూర్యలంక వరకు విస్తరించాయి. హైదరాబాద్‌లో ఫాంహౌస్‌, రిసార్ట్స్‌లలో రహస్యంగా నిర్వహించే ముజ్రా నృత్యాల సంస్కృతి ఇపుడు ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న సూర్యలంక వరకు చేరింది. 
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న బీచ్‌ సూర్యలంక. ఇక్కడికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటక శాఖ రిసార్ట్స్‌తో పాటు ప్రైవేటు రిసార్ట్స్‌ ఈ ప్రాంతంలో వెలిశాయి. శుక్ర, శని, ఆదివారాలు ఇవి కిటకిటలాడుతుంటాయి. ఎక్కువగా యువత వారాంతంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సరదాగా గడిపి వెళ్తుంటారు. 
 
హైదరాబాద్‌ పరిసరాల్లో ముజ్రా నృత్యాలు, రేవ్‌ పార్టీల సంస్కృతి పెరిగిపోయింది. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. గోవా నుంచి ఈ సంస్కృతి విస్తరించింది. ఇది చిన్నగా సూర్యలంకకు చేరింది. ఇక్కడ అయితే పెద్దగా పోలీసుల నిఘా ఉండదని భావించి హైదరాబాద్‌ నుంచి వస్తున్న కొందరు పర్యాటకులు ముజ్రా నృత్యాల పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 
 
ఇక్కడ బీచ్‌కు వెళ్లే రహదారిలో రామ్‌నగర్‌ సమీపంలో శివ రిసార్ట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 8 మంది యువతులు అశ్లీల నృత్యాలు చేస్తుండగా అర్థరాత్రి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ముజ్రా నృత్యాలతో పార్టీ చేసుకుంటున్న సంగారెడ్డికి చెందిన 22 మందిని అరెస్ట్‌ చేశారు. అయినప్పటికీ.. వారాంతాల్లో అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగానే సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments