Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలంలోనూ గిరిజనులకు అండ: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (22:28 IST)
గిరిజన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ద్వారా గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత అధికంగా గిరిజన ఉత్పత్తులను సేకరించగలిగామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ జీసీసీ గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారాన్ని చేయడం ద్వారా కరోనా కష్టకాలంలోనూ గిరిజనులకు అండగా ఉంటూ ఆర్థిక చేయూతను అందించిందని వివరించారు. గత ఏడాదిలో రూ.368 కోట్ల వ్యాపారాన్ని చేసిన జీసీసీ ఈ ఏడాది రూ. 450 కోట్ల వ్యాపారాన్ని చేసిందని వెల్లడించారు.
 
జీసీసీ ద్వారా 2020-21 ఏడాదిలో సాగించిన ఆర్థిక కార్యకలాపాలలో సాధించిన ప్రగతిని గురించి శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పుష్ప శ్రీవాణి వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు సేకరించే చిన్నతరహా అటవీ ఉత్పత్తులను, ఏజేన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసే వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ సేకరించడం ద్వారా గిరిజనులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించేలా చూస్తుందని చెప్పారు.

అటవీ ఉత్పత్తులలో ముఖ్యంగా తేనె, చింతపండు, కుంకుడుకాయలు, నన్నారి ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులలో కాఫీ, రాజ్మా, పసుపు, రాగి, జీడిపప్పు తదితరాలను జీసీసీ సేకరించి వాటిని మార్కెట్లో విక్రయిస్తుందని చెప్పారు. ఇదికాకుండా ప్రత్యేకంగా పెట్రోల్ పంపులను, సూపర్ బజార్లను నిర్వహించడంతో పాటుగా పౌరసరఫరాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా గిరిజన ప్రాంతాల్లో జీసీసీ చేపడుతోందని తెలిపారు.

గిరిజనులు సేకరించిన ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడంతో పాటుగా గిరిజన రైతులకు అవసరమైన రుణాలను కూడా జీసీసీ ఇవ్వడం జరుగుతోందని వివరించారు. అటు ఉత్పత్తుల సేకరణలోనూ, ఇటు అమ్మకాలలోనూ జీసీసీ గణణీయమైన ప్రగతిని సాధించగలిగిందని చెప్పారు. 2019-20 సంవత్సరంలో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు రూ.13.18 కోట్లను వెచ్చించడం జరిగిందని చెప్పారు.

అయితే 2020-21 సంవత్సరంలో రూ.76.37 కోట్లతో వీటిని సేకరించామని తెలిపారు. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు కూడా 2019-20లో రూ.24.22 కోట్ల మేరకు జరగగా 2020-21లో ఈ అమ్మకాలు కూడా రూ.33.07 కోట్లకు పెరిగాయని వివరించారు. త్తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.

2019-20 సంవత్సరం మొత్తం మీద జీసీసీ తన కార్యక్రమాల ద్వారా రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగలిగిందని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన 2020-21 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉండి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం వాటిల్లినా, గిరిజన ఉత్పత్తుల సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యల ఫలితంగా 2020-21లో జీసీసీ రూ. 450.68 కోట్ల మేరకు వ్యాపారాన్ని చేయగలిగిందని వెల్లడించారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ గతేడాది కంటే మెరుగైన ఫలితాలను సాధించిన జీసీసీ అధికార సిబ్బందిని పుష్ప శ్రీవాణి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీసీసీ  ద్వారా మరింత ఎక్కువగా కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments