Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు : మంత్రి ఆదిమూలపు

Advertiesment
10th class public exams
, శనివారం, 5 జూన్ 2021 (22:07 IST)
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపధ్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు.

"అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదు. లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉంది. పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదు.

పదో తరగతే ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ప్రమాణం. పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తామనడంలేదు" అని తెలిపిన మంత్రి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందానంద సరస్వతికి పురాణాలు తెలియవు, తిరుమలలోనే ఆంజనేయుడు జన్మించాడు