Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లల భవిష్యత్తు బంగారు మయం: మంత్రి ఆదిమూలపు

ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లల భవిష్యత్తు బంగారు మయం: మంత్రి ఆదిమూలపు
, సోమవారం, 10 ఆగస్టు 2020 (08:27 IST)
గిరిజనాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం గిరిజనుల కోసం పాటు పడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

ప్రకాశం జిల్లా దోర్నాలలో మంత్రి  మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాల అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతో ఉన్నత శిఖరాలకు గిరిజనులు చేరుకోవాలని, విద్య ద్వారానే అటువంటి విజయాలు అందుకోగలమన్నారు.

పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనేది జగనన్న ఉద్దేశ్యమని అందుకోసం విద్యకు అధిక నిధులు కేటాయించటం జరిగిందన్నారు. 
 
గిరిజన బాలికలను చదువుకునేలా ప్రోత్సహించాలని, ముఖ్యమంత్రి జగనన్న గిరిజనులకోసం ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.

నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను చూసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ కోసం సిపార్సులు చేసె పరిస్థితులు రాబోతున్నాయన్నారు. 
 
ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లల భవిష్యత్తు బంగారు మయం కాబోతుందని ఆయన అన్నారు. అటవీశాఖ నిభంధనలతో కొన్ని గిరిజన గూడేలు అభివృద్ధికి నోచుకోవటం లేదని, విద్యుత్, రోడ్డు సౌకర్యాలకు అటవీశాఖ నిభందనలు అడ్డు నిలిచాయన్నారు.

వన్య ప్రాణుల సంరక్షణ తో పాటు అక్కడ ఉండే మనుషుల గురించి కూడా అధికారులు ఆలోచించాలన్నారు. ఇటువంటి ఎన్నో సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 
 
గిరిజన గూడేల్లో సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ అన్నారు. అనంతరం గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేసిన పలు పథకాలకు సంబందించిన  పరికరాలు లబ్దిదారులకు పంపిణీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం