Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడప జిల్లాలో 5 కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు: మంత్రి ఆదిమూలపు సురేష్

Advertiesment
కడప జిల్లాలో 5 కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు: మంత్రి ఆదిమూలపు సురేష్
, ఆదివారం, 26 జులై 2020 (09:11 IST)
కడప జిల్లాలో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు తీసుకున్నట్లు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్  ఛాంబర్ లో జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణా, నివారణా చర్యలపై ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టరు సి.హరి కిరణ్, ఎస్పి కెకెఎన్’ అన్బురాజన్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపి  అవినాష్ రెడ్డి, ఎంఎల్ఏ లు ఎస్.రఘురామి రెడ్డి, పి.రవీంద్రనాథ్ రెడ్డి, మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, ఎం.సుదీర్ రెడ్డి, జాయింట్ కలెక్టరు(అభివృద్ధి) సిఎం సాయి కాంత్ వర్మ, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భాగా కరోనా వైరస్ నియంత్రణకు జిల్లాలో అమలు చేస్తున్న పటిష్ట చర్యలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, హాస్పిటల్ మానేజ్మెంట్, జిల్లా కోవిడ్ హాస్పిటల్ ఫాతిమా, గ్లోబల్, శ్రీనివాస, హజ్ భవన్ లలో ఉన్న పేషంట్లు వైద్య చికిత్సలు, డిశ్చార్జ్ లు, కంటైన్మెంట్ జోన్స్, కోవిడ్ ఇన్స్టంట్ ఆర్డర్ మార్గదర్శకాల అమలులు తదితర అంశాల పై తీసుకున్న చర్యలను కలెక్టరు మంత్రికి వివరించారు.

అనంతరం ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ.... ముఖ్యంగా ఈ వర్ష కాల సమయంలో కరోనా మహమ్మారి ఉధృత పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించే విధంగా అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్న దృష్ట్యా ఏర్పాట్లను పెంచడం జరుగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలతో కోవిడ్-19 నియంత్రణకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చే రేషన్ కాని, టెస్ట్స్ చేసే ఫలితాలు, 108 వాహనాలు, రాపిడ్ టెస్టులు ఇలాంటివన్ని సరిక్రొత్తగా దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్నట్లు ప్రజానికానికి తెలియజేస్తున్నామన్నారు.  కడపలో కూడా కంటైన్మెంట్ జోన్లు పెరిగిన పరిస్థితిని గమనిస్తున్నామని, సుమారుగా జిల్లా అంతట 500 పైగా కంటైన్మెంట్ జోన్లు వున్నాయి.

పాజిటివ్ కేసులు ఉండి లక్షణాలు ఉన్నవారు ఆందోళన చెందరాదని, నివారణ ఏర్పాట్లను చాలా పకడ్బందిగా చేస్తున్నాం. ఇది వరకు వున్న క్వారంటైన్ సెంటర్లు కాకుండా జిల్లాలో కొత్తగా 5 కరోనా కేర్ సెంటర్లు... గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజ్, హజ్ భవన్, శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజ్, కందుల ఇంజినీరింగ్ కాలేజ్, వైవియు తదితర కరోన కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వాటిలో ఆక్సిజన్ అవైలబిలిటి, బెడ్స్, మందుల, డాక్టర్లు పూర్తిగా అన్ని వసతులతో పేషంట్స్ కు చికిత్స చేసుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అంతే కాకుండా పాజిటివ్ కేసుల ఎమేర్జన్సి నిమిత్తం 108 వాహనాలను ప్రత్యేకంగా కేటాయిస్తున్నారని, సుమారు 1000 బెడ్స్ వరకు కూడా రిమ్స్, ఫాతిమా లో ఏర్పాటు చేశారని, జిజీహెచ్ ప్రొద్దుటూరు, పులివెందుల ఏరియా హాస్పిటలలో వెంటిలేటర్స్ తో పాటు భోజనాలతో సహా ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కరోనా పాజిటివ్ పేషంట్ కు రోజుకు సుమారు రూ.300 నుండి రూ.500 ల వరకు ఖర్చు పెడుతూ మంచి మెనుతో ప్రతి చోట పౌష్టికాహారం, శాఖాహారం, మాంసాహారం అన్ని రకాల భోజానాలు, జ్యుసులు, ఉదయం జావ తదితరాలను ఒక సిష్టమ్యాటిక్ గా ఎందులో కూడా రాజి పడకుండా పేషంట్స్ ను చూసుకోవడం జరుగుతోందన్నారు.

ఇది కాకుండా కొందరు సెల్ఫ్ క్వారంటైన్ లో స్వీయ నిర్బందనలో వుండాలని, వారికి అన్ని పరీక్షలు చేసి వారి ఎమెర్జెన్సి, ప్రైమరీ స్థాయిని నిర్ధారించిన తర్వాతనే వారిని సెల్ఫ్ క్వారంటైన్ కు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోనా వేగంగా ప్రభలుతున్న సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం జిలా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, మెడికల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అందరూ వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రుల పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోందన్నారు.

ఎవరికీ అసౌకర్యం కలగకుండా కంటైన్మెంట్ జోన్ల అమలు పై జిల్లా ఎస్పితో కూడా సమీక్ష చేయడం జరిగిందన్నారు. పోలీస్ వారు, రెవిన్యూ సిబ్బంది కలిసి కట్టుగా పూర్తి సమన్వయంతో పని చేయడం జరుగుతోంది. పాజిటివ్ కేసు నుండి నార్మల్ కేసు వరకు వివక్షతతో చూడకుండా చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. మరణాలు సంభవించినపుడు అలాంటి వాటిని డిస్పోజ్ చేయడానికి కూడా అందరు మానవత దృక్పథంతో సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ చిన్న అనుమానం వున్నా కూడా దగ్గర లోని కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లి పరీక్ష చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ వైరస్ ఎప్పటివరకు ఉంటుందో చెప్పలేమన్నారు. వాక్సిన్ కనుగొనేంత వరకు మనమందరం స్వీయ నియంత్రణలో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కోవిడ్ నేపధ్యంలో పాటశాలలో పరీక్షలు అన్ని వాయిదా వేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

సమావేశంలో ఎంపి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..... జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు చేశారు, ఎటువంటి వసతులు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలి, రాబోయే రోజుల్లో ఇబ్బంది కరమైన పరిస్థితులు వస్తే ఏం చేయాలి అన్న విషయాల పై జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టరు, ఎస్పి, జాయింట్ కలెక్టరు మరియు శాశన సభ్యులు అందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇందులో ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 1 లక్ష 20 వేల పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వీటిలో 4500 దాకా పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. గడచిన 4, 5  రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా వచ్చాయని, దానికి తగినట్లు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా వున్న మాట వాస్తవమేనన్నారు.

ప్రభుత్వం అన్ని విధాలుగా నివారణా చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఎవరూ భయానికి గురి కాకుండా పాజిటివ్ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించాలని సూచించారు. టెస్ట్ చేసిన తర్వాత శ్వాశ ఇబ్బంది వుంటే డాక్టరును సంప్రదించి కోవిడ్ ఆసుపత్రికి రెఫెర్ చేయడం జరుగుతుందన్నారు. లక్షణాలు ఉన్న వారిని కోవిడ్ కేర్ సెంటర్ కు పంపుతారన్నారు.

పాజిటివ్ వచ్చి ఏ లక్షణాలు లేని వారిని వారు ఇష్టపడితే హోం క్వారంటైన్ లో ఉంచుతారన్నారు. వారికి మెడికల్ కిట్, తగిన సూచనలు ఇచ్చి హోమ్ క్వారంటైన్ లోనే పెట్టె ఆస్కారం ఉందన్నారు. మరీ ఇబ్బంది కరమైన పరిస్థితి ఉంటె డాక్టర్లే వారిని రిమ్స్ కు గాని, ఫాతిమా కు కాని రెఫెర్ చేసి పంపుతారని, అక్కడ కూడా ఇబ్బంది కరమైన పరిస్థితి ఉంటె హయ్యర్ కేర్ సెంటర్(కోవిడ్ స్టేట్ హాస్పిటల్) స్విమ్స్ కు రెఫెర్ చేస్తారన్నారు.

జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ ను ఎదుర్కునే చర్యలు చేస్తోందని, కోవిడ్ సెంటర్లలో 2000 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్నవని అన్నారు. వీటన్నిటికి టై అప్  గా ఫాతిమా ఇన్స్టిట్యూషన్ ఉందని దాని పైన రిమ్స్, దాని పైన స్విమ్స్, సీరియస్ నెస్ ను బట్టి ఎక్కడ ఎవరిని పెట్టాలో వారిని అక్కడ ఉంచడం జరుగుతుందని చెప్పారు.

కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న సందర్భంగా రాబోయే కొన్ని వారాల్లో హోం క్వారంటైన్ లో నయం అయ్యే అవకాశం ఉందన్నారు. ఎక్కువ వయసు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రికి వెళ్లి నయం చేసే పరిస్థితి ఉంటుందన్నారు. ఒక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ, పారిశ్యుద్ధ కార్మికులు తమ భుజాలపై వేసుకుని కోవిడ్ నియంత్రణ పై పోరాటం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం ఆరోగ్య శ్రీ క్రింద కొవిడ్ చికిత్సను తీసుకువచ్చిందని, అయితే ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు కొవిడ్ పేషంట్లను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు ముందుకు వచ్చి హాస్పిటల్ కెపాసిటీలో ఒక 20 శాతం బెడ్లను కేటాయించి కొవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని పేషంట్లకు చికిత్సను అందించాలని కోరుతున్నామన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద ప్రైవేటు హాస్పిటల్స్ ముందుకు వచ్చి పేషంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద భారం తగ్గే అవకాశం ఉందన్నారు.

సమావేశంలో జిల్లా కలెక్టరు సి.హరి కిరణ్ మాట్లాడుతూ....  కోవిడ్ నుంచి ప్రజలెవ్వరూ భయపడాల్సిన పనిలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

10 సం.ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, 60 సం.ల పై బడిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్ అని వస్తే హోం ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందన్నారు. అయితే స్థానికంగా ఉన్న ఏయెన్ఎంకు, డాక్టరుకు సదరు వ్యక్తి హోం ఐసోలేషన్లో ఉన్నానని తెలియచేయాలన్నారు.

పల్స్ ఆక్సిమిటర్ ప్రతి ఏఎన్ఎం వద్ద ఉంటుంది. ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేయించుకుంటూ 94% కంటే ఎక్కువగా ఆక్సిజన్ అందుతుంటే నిరభ్యంతరంగా హోం ఐసోలేషన్లో ఉండవచ్చునన్నారు. టెలి మెడిసిన్ ద్వారా డాక్టర్లు వైద్యం అందిస్తారన్నారు. కలెక్టరేట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతిరోజు ఫోన్ చేసి డాక్టరు, ఏఎన్ఎం ద్వారా మందులు ఇచ్చారా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీయడం జరుగుతుందన్నారు.

గుండె, బిపి, డయాబెటిస్, ఊపిరితిత్తుల జబ్బులతో బాధ పడేవారికి పాజిటివ్ వస్తే తప్పనిసరిగా కోవిడ్ కేర్ సెంటరుకు రావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఫాతిమా, రిమ్స్, డిహెచ్ ప్రొద్దుటూరు, ఏరియా హాస్పిటల్ పులివెందుల ఆసుపత్రులలో  సేవలు అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్లు అంబులెన్సులు అన్ని సిద్దంగా ఉన్నాయి.

అత్యవసరమైతే స్టేట్ కోవిడ్ సెంటర్, స్విమ్స్, తిరుపతికి తరలించడం జరుగుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కాగా, మన రాష్ట్రంలోనే 13 జిల్లాలో అత్యదికపరీక్షలు చేసిన జిల్లాలో మన జిల్లా 3-4 స్థానాల్లో నిలిచిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 1.20 లక్షల టెస్టులు చేశామన్నారు.

ఒక్కో టెస్టుకు 3000-3500/- వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.500/- లు అని, ప్రభుత్వం మనకు కావలసినన్ని కిట్లను సరఫరా చేసిందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఒక్కొక్క పేషంటుకు రూ.500/- ఖర్చు చేసి మంచి నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు.

ఇందులో నాన్-వెజ్, కోడి గుడ్డు, పండ్లు లాంటి భలవర్దకమైన ఆహారాన్ని ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది ఈ వైరస్ బారిన పడి విజయవంతంగా కోలుకుని తిరిగి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సంక్రమించినప్పుడు శరీరంలో ఏమి జరుగుతుంది?