Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరకలెత్తుతున్న తుంగభద్ర నది

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (18:22 IST)
తుంగభద్ర నది ఉరకలెత్తుతోంది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సైతం 1,55,431 క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
 
మంగళవారం వరద పోటు పెరిగే సూచనలు ఉండటంతో 2 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డు సెక్షన్ అధికారి విశ్వనాథ్ చెప్పారు. డ్యాంలో ప్రస్తుతం 100.663 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీరు బుధవారం నాటికి ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకోనుంది. అక్కడి నుంచి సుంకేసుల బ్యారేజీకి వరద చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. 
 
నదీతీర గ్రామాలకు హెచ్చరిక.. 
తుంగభద్ర డ్యాం నుంచి 33 గేట్ల ద్వారా 1,55,431 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేయడంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులను అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డ్ హెచ్చరిక జారీ చేసింది. ఆయా రాష్ట్రాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇరిగేషన్, రెవిన్యూ యంత్రాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. తుంగభద్ర నదితీర ప్రాంత ప్రజలను నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

తర్వాతి కథనం
Show comments