మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వులలో కలిపి...

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (21:00 IST)
సౌందర్య సాధనాల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు. ఇక అలంకరణ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇంకా ఫర్‌ఫ్యూమ్‌లలో అయితే మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు. ఈ మల్లెపూలతో పలు అనారోగ్య సమస్యలను కూడా వదిలించుకోవచ్చు. అవెంటో చూద్దాం.
 
1. తలలో చుండ్రు సమస్య అధికంగా వుంటే మెంతులలో కాసిన్ని ఎండు మల్లెపూలు కలిపి నూరి తయారైన… పూతను తలకు పట్టిస్తే మంచిది. జుట్టు కూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. 
 
2. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నాననిచ్చి, మరిగే వరకూ కాచి వడగట్టి వాడితే తల సువాసన భరితం కావడమే కాకుండా కేశాలకు మంచి పోషణ అవుతుంది. మాడుకు మేలు చేస్తుంది. 
 
3. మల్లెల్ని ఫేస్‌ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి, కొద్దిగా పచ్చిపాలు కలిపి, నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత ముల్తానా మట్టి, గంధం, తేనె అరస్పూన్‌ చొప్పున కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. 
 
4. మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వులలో కలిపి ఆ రసం, గుడ్డులోని పచ్చసొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా, కాంతివతంగా మెరిసిపోతుంది. 
 
5. చర్మానికి అవసరమయ్యే సి విటమిన్‌ మల్లెల్లో విరివిగా వుంటుంది. అందుకే మల్లె తూడులను అన్నంలో కలిపి తినటం కూడా గ్రామీణ జీవితంలో కనపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శృంగారం గురించి మహిళ రోజుకి ఎన్నిసార్లు ఆలోచన చేస్తుంది?