Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేషన్‌లో పోలీసులను నగ్నగంగా కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ!

sparun
Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (08:15 IST)
సాధారణంగా వివిధ నేరాలకు పాల్పడేవారిని పోలీసులు అరెస్టు తమదైనశైలిలో విచారిస్తుంటారు. కొందరు నేరాగాళ్ల పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిని పోలీసులు బట్టలూడదీసి నగ్నంగా స్టేషన్‌లో కూర్చోబెడుతుంటారు. దుస్తులు విప్పించి స్టేషన్‌లో కూర్చోబెట్టడాన్ని మనం తరచూ వింటుంటాం కూడా. కానీ, పోలీసుల దుస్తులనే ఊడదీసి... స్టేషన్‌లో కూర్చోబెట్టాడు ఓ పోలీస్ ఉన్నతాధికారి. ఆయన పేరు అరుణ్. విజయనగరం జిల్లా ఎస్పీ. ఆయన ఇలా ఎందుకు నడుచుకున్నారో తెలుసుకుందాం. 
 
విజయనగరం పట్టణంలోని చలవారి కాలనీలో వెంకటేష్ మరికొందరు బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్, అభిషేక్, మంజునాథ్, శ్రీకాంత్ అనే నలుగురు కానిస్టేబుళ్ళు పేకాట శిబిరంపై దాడి చేసి, పేకాట రాయుళ్ల నుంచి రూ.20 వేల నగదు, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు కదా, స్వాధీనం చేసుకున్న డబ్బును, మొబైల్ ఫోనును స్వాహా చేశారు. మరుసటి రోజున వారు స్టేషన్‌కు వెళ్లి తమ మొబైల్ ఫోన్ ఇవ్వాలి పోలీసులను కోరగా, అలాంటి కేసు ఏదీ నమోదు కాలేదని చెప్పారు. దీంతో పోలీసులకు పేకాట రాయుళ్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ చెవిలోపడింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. 
 
ఈ విచారణలో పేకాట శిబిరంపై జరిగిన దాడి, నగదు, సెల్‌ఫోన్ కాజేసినట్టు తేలింది. దీంతో నలుగురు కానిస్టేబుళ్ళపై కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి రెండు గంటల పాటు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. వారిని సస్పెండ్ చేసిన ఎస్పీ కోర్టు ఆదేశం మేరకు రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments