ఏపీలోని విజయనగరం జిల్లాలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. స్థానికంగా ఉండే రవి జ్యూవెలరీ షాపులో 5 కేజీల బంగారాన్ని చోరీ చేశారు. దుండగులు దుకాణం పైకప్పును తొలగించి షాపులోకి ప్రవేశించి మొత్తం 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.
దుకాణం యజమాని బుధవారం ఉదయం షాను తెరిచి చూడగా, అల్మారాల్లోని పెట్టెలు ఖాళీగా కనిపించాయి. దీంతో లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరిస్తున్నారు.
చోరీ జరిగిన ప్రాంతాన్ని విజయనగరం జిల్లా డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాస రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలను మరోవైపునకు తిప్పి, బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారుల సేకరించే పనిలో నిమగ్నమైవున్నారు.