పవన్ కళ్యాణ్‌కు ఏపీ పోలీసుల నోటీసు - వైజాగ్‌ను వీడాలంటూ అల్టిమేటం

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (14:17 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైజాగ్ పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. సాయంత్రం 4 గంటల లోపు విశాఖపట్టణాన్ని వీడాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులను తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించారు. దీంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
జనవాణి పేరుతో పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటన తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్‌తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments