Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల కుమార్తెను కన్నతండ్రే కాటేయబోయాడు.. కత్తిపీటతో...

విశాఖపట్టణం పట్టణంలోని జాలరి పేటలో పదేళ్ళ కుమార్తెను కన్నతండ్రే కాటేయబోయాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె కత్తిపీటతో దాడికి యత్నించడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ కామాంధుడు పారిపోయాడు.

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (08:27 IST)
విశాఖపట్టణం పట్టణంలోని జాలరి పేటలో పదేళ్ళ కుమార్తెను కన్నతండ్రే కాటేయబోయాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె కత్తిపీటతో దాడికి యత్నించడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ కామాంధుడు పారిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జాలరిపేటకు చెందిన దంపతులకు పదేళ్ళ కుమార్తె, 12 యేళ్ళ బాలుడు ఉన్నాడు. వీరిద్దరినీ ఓ సంక్షేమ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. ఈ క్రమంలో వేసవి సెలవులు కావడంతో కుమార్తె ఇంటికి వచ్చింది. కుమార్తెను ఇంట్లో వదిలిపెట్టి తల్లి పనుల కోసం ఉదయాన్నే వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన కన్నతండ్రి.. పదేళ్ళ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అయితే, ఆ బాలిక గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
 
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి ఈ విషయం కుమార్తె చెప్పి బోరున విలపించింది. దీంతో ఆగ్రహోద్రుక్తురాలైన ఆ మహిళ.. రాత్రి ఇంటికి వచ్చిన భర్తపై తిరగబడింది. వంటిట్లో ఉండే కత్తిపీటను తీసుకుని దాడి చేసేందుకు యత్నించింది. దీంతో ఆ కామాంధుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారి ద్వారా పోలీసులకు చేరింది. అయితే, భర్తపై భార్యపై కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ కామాంధుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments