Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు సరైన చర్య కాకుంటే ప్రజలే చెప్పుతో కొడతారు : బీజేపీ ఎంపీ

దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య కాకుంటే ప్రజలే తమకు తగిన బుద్ధి చెప్పేలా చెప్పుతో కొడతారని భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్టణం ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (11:27 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య కాకుంటే ప్రజలే తమకు తగిన బుద్ధి చెప్పేలా చెప్పుతో కొడతారని భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్టణం ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైంది కాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని, అలాగే నోట్లను దారిమళ్లించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
దేశంలో పెరిగిపోతున్న నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకే నోట్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో చర్చించకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయన్నారు. నల్లధన కుబేరులు కాంగ్రెస్ పార్టీలోనే అధికంగా ఉన్నారన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ ఆరోపించారు.
 
కాగా, జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ యూనివర్సిటీ విషయంలో బీజేపీ జోక్యం చేసుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌కు పరోక్షంగా హరిబాబు కౌంటర్ ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments