Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్‌బాయ్ బరి తెగింపు... కాలింగ్ బెల్ కొట్టి.. చాకుతో పొడిచి.. దోపిడీ

కడప జిల్లాలో ఓ పేపర్ బాయ్ బరితెగించాడు. వేకువజామునే ఓ ఇంటికి దినపత్రిక వేసేందుకు వచ్చిన ఆ పేపర్ బాయ్... కాలింగ్‌ బెల్‌ కొట్టి.. ఓ మహిళను చాకుతో గాయపరిచి.. ఆమెను బెదిరించి రూ.10 వేలు దోచుకుని పారిపోయాడ

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (10:31 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరు ఓ పేపర్ బాయ్ బరితెగించాడు. వేకువజామునే ఓ ఇంటికి దినపత్రిక వేసేందుకు వచ్చిన ఆ పేపర్ బాయ్... కాలింగ్‌ బెల్‌ కొట్టి.. ఓ మహిళను చాకుతో గాయపరిచి.. ఆమెను బెదిరించి రూ.10 వేలు దోచుకుని పారిపోయాడు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పాశం సుబ్బయ్య, సావిత్రమ్మ దంపతులు రెండుకొళాయిలు పోవు మార్గంలో కడప టెక్నో స్కూల్‌ సమీపంలో నివాసముంటున్నారు. సుబ్బయ్య ఎర్రగుంట్లలో మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తూ 2012లో పదవీ విరమణ చేశారు. 
 
శనివారం ఉదయం సుబ్బయ్య మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన సమయంలో రోజూ ఇంటికి పేపర్‌ వేసే యువకుడు వచ్చాడు. కాలింగ్‌బేల్‌ కొట్టాడు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన భర్త వెనక్కి తిరిగి వచ్చాడేమో అనుకున్న సావిత్రమ్మ తలుపు తీసింది. దీంతో పేపర్‌బాయ్‌ లోపలికి వచ్చి.. పేపర్‌ వేస్తున్నా, సరిగా వేయడం లేదని నాపై కంప్లయింట్‌ చేస్తావా అంటూ అమెతో గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న చాకుతో ఆమె ముఖంపై, చేతిపై గాయపరిచాడు. డబ్బులివ్వాలని బెదిరించడంతో బీరువాలో ఉన్న రూ.10 వేలు నగదుకు అతనికి ఇచ్చేసింది. 
 
అంతటితో ఆగక ఆమెను బెడ్‌రూంలో ఉంచి, గదితలుపు గడియ పెట్టి, ఇంకా డబ్బులు, నగలు కోసం వెదికాడు. ఏవీ కన్పించకుండా పోవడంతో గ్యాస్‌ సిలిండర్‌ను లీక్‌ చేసి, నీవు బతికుంటే నాకు ప్రమాదమే అని చెప్పి నిప్పు పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె గది కిటీకిలో నుంచి కేకలు వేయడంలో పక్కనే ఉంటున్న పనిమనిషి, ఆమె భర్త రావడంతో ఆ యువకుడు తనతో తెచ్చుకున్న సైకిల్‌ను, దినపత్రికలను అక్కడే వదిలేసి పారిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న భర్త సుబ్బయ్య పరుగుపరుగున ఇంటికి తిరిగొచ్చాడు. జరిగిన విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం చేయవేయగా, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఉడాయించిన పేపర్ బాయ్ కోసం గాలిస్తున్నారు. సావిత్రమ్మను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments