వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు... 7 గంటల పాటు విచారణ

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (13:30 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ బృందంలోని అధికారులకు కరోనా వైరస్ సోకడంతో ఏడు నెలల పాటు ఈ కేసు విచారణ ఆగిపోయింది. ఇపుడు మళ్లీ మొదలైంది. 
 
ఆదివారం కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటలపాటు సుధీర్ఘంగా విచారించి, కీలక వివరాలు సేకరించినట్టు సమాచారం. ఆమధ్య దస్తగిరిని సీబీఐ ఢిల్లీకి పిలిపించి, నెల రోజులపాటు విచారించి, తిరిగి కడపకు పంపింది. తాజాగా మళ్లీ ఆయనను పిలిచిన అధికారులు సుదీర్ఘంగా విచారించడం గమనార్హం. 
 
వివేకానందరెడ్డి హత్యకు ఆరు నెలల ముందు ఉద్యోగం నుంచి మానేయడంపై అతనిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే, అతడి ఆర్థిక లావాదేవీల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో పులివెందుల వెళ్లిన అధికారులు వివేకానంద రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఇదే కేసులో మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments