Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా మాజీ డ్రైవ‌ర్ని ప్ర‌శ్నిస్తున్న సిబిఐ

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:45 IST)
వివేకా హత్య కేసు విచార‌ణ‌ను సిబిఐ వేగ‌వంతం చేస్తోంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ఇపుడు సిబిఐ  అధికారులు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ రెండు బృందాలు విడిపోయి పులివెందులకు వెళ్లి విచారిస్తున్నాయి.

సోమవారం రాత్రి పులివెందుల ఆర్​అండ్​బి అతిథి గృహం చేరుకున్న సీబీఐ బృందం, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారణకు పిలిచారు.  దాదాపు గంటకు పైగా హత్య కేసుకు సంబంధించి ద‌స్త‌గిరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 
 
అంతకు ముందు సాయంత్రం మరో బృందం వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. వివేకా ఇంటి నుంచి సమీపంలోని ఆటో మొబైల్ దుకాణం వరకు సీబీఐ అధికారులు కొలతలు తీసుకున్నారు.
 
వివేకా ఇంటి రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న కొలతలను ఆటో మొబైల్ దుకాణం ప్రహరీ గోడను.. దాని ఎత్తును పరిశీలించి సర్వేయర్ ద్వారా కొలతలు వేసి, రికార్డు నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఈ ప్రాంతం నుంచి దుండగులు ఏమైనా వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మ‌రో సిబిఐ   బృందం పులివెందుల నుంచి కడపకు రాగా, మరో బృందం కడప నుంచి పులివెందుల చేరుకొని అనుమానితులను విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments